రూ.32వేల కోట్లతో ప్రాజెక్ట్ తో “జియో” కి చెక్ పెట్టేందుకు సిద్దమయిన ” ఎయిర్ టెల్ “

టెలికాం మార్కెట్‌లో దిగ్గజ నెట్వర్క్ లకు చుక్కలు చూపించిన రిలయన్స్‌ జియోకు చెక్‌ పెట్టడానికి దిగ్గజ కంపెనీలన్నీ ఒక దాని తరవాత ఒకటి పధకాలు రచిస్తున్నాయి. టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ అయితే భారీ మొత్తంలో రూ.32వేల కోట్లను వెచ్చించి, తమ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించుకోవడానికి వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.32వేల కోట్లకు పైగా ఖర్చుచేయడానికి సిద్దమయ్యింది.అదేవిధంగా రెవెన్యూ మార్కెట్‌ షేరులో 3-4 శాతం పాయింట్లను అధికంగా ఆర్జించడానికి కూడా సన్నాహాలు చేస్తుంది. మిగతా కంపెనీలు ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్‌ ఇండియాలు కూడా జియోకు అడ్డుకట్ట వేయడానికి విలీన ప్రక్రియకు తెరతీశాయి. ఇలా జియో దెబ్బకు అల్లాడుతున్న కంపెనీలన్నీ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి అనేక వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి. జియోను తట్టుకోవడానికి ఎన్ని ప్లాన్స్‌ వేసినా.. అవి వర్క్‌వుట్‌ కావడం లేదు. కానీ ఈ సారి ఎయిర్‌టెల్‌ పెద్ద ఎత్తునే ప్లాన్‌ వేస్తోంది.ఈ టెలికాం దిగ్గజం ఆర్పూ(ఒక్కో యూజర్‌పై ఆర్జించే కనీస రెవెన్యూ)ను కాపాడుకోవడం కోసం ధరలను మరింత తగ్గించుకోవాలనుకోవడం లేదని కూడా తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం పెడుతున్న పెట్టుబడులతో డేటా నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *