జియో 4జి ఫోన్ షరతులు …! ఉచితంగా లబించడం కష్టమే..?

జియో 4జి ఫోన్ కొనాలి అనుకుంటున్నారా అయితే మీరు షరతులు తప్పక తెలుసుకోవాలి..! మొదటిగా జియో రూ.1500  సెక్యూరిటి డెపోజిట్ తో  పొందవచ్చునని , 3 సంవత్సరాల డెపోజిట్ చేసిన రూ.1500 మొత్తం తిరిగి పొందవచ్చునని జియో  సంస్థ ప్రకటించింది.ఇప్పుడు తాజాగా జియో  వెబ్ సైట్ లో కొన్ని షరతులను పొందుపరచడం ఇప్పుడు వినియోగదారుల ఆశలకు గండి కొట్టినట్లయింది. ప్రస్తుతం జియో తమ వెబ్ సైట్ ద్వారా పొందుపరచిన షరతులు ఒకసారి మనం చూద్దాం.

1. డిపాజిట్‌  చేసిన  రూ.1500  సొమ్ము తిరిగి పొందాలంటే మూడు సంవత్సరాల్లో కనీసం రూ.4500  విలువైన రీచార్జ్‌ చేసుకోవాలి.

2. మూడు నెలల పాటు ఎలాంటి  రీచార్జ్‌లు  చేసుకోకుండా  వుంటే  రావాల్సిన రిఫండ్‌ మనీ రూ.1500 వెనక్కి రాదు.

3. మూడేళ్ల పాటు సంవత్సరానికి ఖచ్చితంగా రూ.1500 (మొత్తం రూ.4500) విలువైన రీచార్జ్‌ కచ్చితంగా  చేసుకోవాలి.

4. మధ్యలోనే  జియో ఫోన్‌ వెనక్కి ఇచ్చేయాలని  ప్రయత్నిస్తే మరో బాదుడు తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *