మళ్ళీ అగ్రస్థానంలో ఆల్టో…

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20:

దేశవ్యాప్తంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల్లో కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీకి చెందిన ఆల్టో మళ్లీ అగ్రస్థానం కైవసం చేసుకుంది. గడిచిన ఆర్ధిక సంవత్సరానికి సంబందించి ఈ స్థానాన్ని దక్కించుకుందని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) వెల్లడించింది.

అయితే ఇందులో మరో విశేషం ఏమిటంటే టాప్-10 ప్యాసింజర్ వాహనాల్లో జాబితాలో మారుతికి చెందినవి ఏడు కార్లు చోటు దక్కించుకున్నాయి. ఇక మిగతావి హ్యుందాయ్‌కు చెందినవి.

2017-18లో 2,58,539 యూనిట్ల ఆల్టో కార్లు అమ్ముడయ్యి తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో మారుతికి చెందిన డిజైర్(1,96,990 యూనిట్లు) నిలిచింది. అదే కంపెనీకి చెందిన హ్యాచ్‌బాక్ బాలెనో 1,90,480 యూనిట్లు అమ్ముడై మూడో స్థానానికి ఎగబాకింది.

ఇటీవల మార్కెట్లోకి విడుదలైన స్విఫ్ట్ నాలుగోస్థానం(1,75,928), వ్యాగన్ ఆర్‌కు ఆ తర్వాతి స్థానం(1,68,644 యూనిట్లు) లభించినట్లు సియామ్ నివేదిక వెల్లడించింది.

అదేవిధంగా హ్యుందాయికి చెందిన కాంప్యాక్ట్ గ్రాండ్ ఐ10(1,51,113 యూనిట్లు)కు ఆరోస్థానం వరించింది. అలాగే ఏడో స్థానంలో మారుతికి చెందిన కాంప్యాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజా(1,48,462 యూనిట్లు), హ్యుందాయి ఎలైట్ ఐ20కి ఎనిమిదోస్థానం, ఎస్‌యూవీ క్రెటాకు తొమ్మిదోస్థానం, మారుతికి చెందిన మరో కాంప్యాక్ట్ మోడల్‌కు చివరి స్థానం లభించాయి. దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో ఈ రెండు సంస్థలు అధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనమనే చెప్పుకోవాలి.

మామాట: పూర్వ వైభవం 

English summary:

Maruti Suzuki India’s entry level hatchback Alto retained its status as the best selling passenger vehicle in India in 2017-18, leading the company’s dominance with seven of its models featuring in the top ten lists.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *