దేశంలోనే 100 బిలియన్‌ డాలర్ల కంపెనీగా టీసీఎస్

ముంబై, 23 ఏప్రిల్:

దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌(టీసీఎస్) సోమవారం సరికొత్త రికార్డు సృష్టించింది.

తొలిసారిగా దేశంలోనే మెదటి 100 బిలియన్‌ డాలర్ల (రూ. 6,60,000కోట్లు) కంపెనీగా అవతరించింది.

ఈ సందర్భంగా టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టీసీఎస్ మరింత దూసుకెళ్తుందని వాటాదారులను ఉద్దేశించి ఆయన అన్నారు.

ఇటీవల టీసీఎస్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.

ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో శుక్రవారం నాటి షేర్‌ మార్కెట్లో కంపెనీ విలువ అమాంతం పెరిగిపోయింది. ఆ ఒక్కరోజే కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 40వేల కోట్లు పెరిగింది. దీంతో 100 బిలియన్‌ డాలర్ల మైలురాయిని చేరుకునేందుకు మరింత దగ్గరకు వచ్చిన టీసీఎస్, సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో షేరు ధర పెరిగి దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా నిలిచింది.

అయితే ఈ రికార్డుని అందుకోవడం దేశంలోని ఏ ఇతర ఐటీ సంస్థకైనా ఇప్పట్లో కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే టీసీఎస్‌కు ప్రధాన పోటీగా ఉన్న ఇన్ఫోసిస్‌ ప్రస్తుత మార్కెట్‌ విలువ దాదాపు 38 బిలియన్‌ డాలర్లు ఉంది. దీంతో ఇప్పట్లో ఏ ఐటీ సంస్థా ఈ ఘనత దక్కించుకునేలా లేదు.

మామాట: మొత్తానికి 100 బిలియన్ డాలర్ల మార్కుని టచ్ చేసిన తొలి దేశీయ సంస్థ….

English summary:

Tata Consultancy Services (TCS), the country’s largest IT outsourcing company created history on Monday by becoming the first Indian company to reach the $100 billion market capitalization (m-cap) mark.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *