ఫ్లిప్‌కార్ట్‌ని కొనేందుకు 80వేల కోట్లు ఆఫర్ చేసిన వాల్‌మార్ట్..

ముంబై, 23 ఏప్రిల్:

అమెరికాకి చెందిన ప్రముఖ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ఇండియాలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 51 శాతానికిపైగా వాటా పొందేందుకు సిద్ధమైంది.

ఆ వాటాని కొనేందుకు వాల్‌మార్ట్ సంస్థ 1200 కోట్ల డాలర్లు (సుమారు రూ.80 వేల కోట్లు) ఆఫర్ చేసింది.

వచ్చే వారమే ఈ కొనుగోలు ప్రక్రియ మొదలవనున్నట్లు తెలుస్తున్నది. కొన్ని నెలలుగా ఫ్లిప్‌కార్ట్‌తో వాల్‌మార్ట్ సంప్రదింపులు జరుపుతున్నది. అయితే ఈ ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం వాటా ఉన్న జపాన్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్.. వాల్‌మార్ట్ ఆఫర్‌పై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే 80 వేల కోట్ల ఈ డీల్ చాలా తక్కువని ఆ సంస్థ భావిస్తుంది. కానీ ఈ డీల్ తో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ రూ.లక్షా 20 వేల కోట్లుగా ఉండనుంది.

ఇక వాల్‌మార్ట్ రాకతో ఫ్లిప్‌కార్ట్‌ లో ఇప్పటివరకు ఉన్నటువంటి దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్, యాక్సెల్, అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ సంస్థలు తమ పూర్తి వాటాను అమ్మేసేందుకు సిద్ధమయ్యాయి.

మామాట: అయితే ఫ్లిప్‌కార్ట్‌.. వాల్‌మార్ట్‌గా మారనుందా…

English summary:

Wal-Mart Inc. is close to finalizing a deal to buy a majority stake in India’s leading e-commerce company Flipkart for at least $12 billion and may complete the agreement in the next two weeks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *