ఏటీఎం నుంచి పిల్లలు ఆడుకునే బొమ్మ నోట్లు…

లక్నో, 24 ఏప్రిల్:

దేశ వ్యాప్తంగా ప్రజలు నగదు కొరతతో నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

బ్యాంకుల్లో, ఏటీఎంలలో డబ్బులు దొరకక అష్ట కష్టాలు పడుతున్నారు. ఒకవైపు ఇలా ఉండగా మరోవైపు ఏటీఎంల నుండి నకిలీ నోట్లు వస్తున్నాయి.

కానీ అవి కూడా పిల్లలు ఆడుకునేందుకు ముద్రించిన బొమ్మ నోట్లు వస్తున్నాయి. పూర్తిగా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమైన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరెలీలో చోటు చేసుకుంది.

సుభాష్ నగర్ ప్రాంతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో నుంచి ఒరిజనల్ నోట్లు పోలిన ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ నకిలీ నోట్లు రావడం చూసి జనం విస్తుపోతున్నారు.

చురాన్ లేబుల్, భారతీయ మనోరంజన్ బ్యాంక్ పేర్లతో ఉన్న నోట్లు కూడా ఏటీఎం నుంచి వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు.

బ్యాంకు అధికారులు కనీసం ఈ విషయం కూడా గుర్తించలేకపోయారా అని అక్కడి స్థానికులు విమర్శిస్తున్నారు.

అయితే ఈ ఘటన ఒక్క బరేలీలోనే కాదు, కాన్పూర్‌లోని యాక్సిస్ బ్యాంకులో కూడా ఇలాంటి పిల్లల నోట్లు బయటపడ్డాయి. దీనిపై వినియోగదారులు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు.

మామాట: బ్యాంకు అధికారులకి మరి ఇంత నిర్లక్ష్యమా…?

English summary:

The people of Bareilly district in Uttar Pradesh were in for a rude shock when the ATM machine of United Bank of India installed at Subhashnagar started dispensing fake Rs 500 notes, with ‘Children Bank of India’, ‘Bhartiya Manoranjan Bank’ and ‘Churan Lable’ written over it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *