మళ్ళీ భారత్‌లో టాప్ ప్లేస్ కొట్టేసిన షియోమీ….

ఢిల్లీ, 25 ఏప్రిల్:

తక్కువ ధరకే మంచి ఫీచర్లని అందిస్తూ, అమ్మకాలలో దూసుకుపోతున్న చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారి సంస్థ షియోమీ మళ్ళీ భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో టాప్ ప్లేస్ కొట్టేసింది.

ఎన్నో ఏళ్లుగా భారత్‌లో తన హవా కొనసాగిస్తున్న అగ్రగామి సంస్థ శామ్ సంగ్‌ని సైతం పక్కకి నెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో షియోమీ సంస్థ వాటా 31.1 శాతానికి చేరిందని హాంగ్ కాంగ్ కు చెందిన కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. సింగపూర్ కు చెందిన క్యానలిస్ సైతం షియోమీ వాటా 31 శాతానికి చేరినట్టు వెల్లడించింది.

ఇక షియోమీ ధాటికి శామ్ సంగ్ రెండో స్థానానికి దిగజారింది. ఈ సంస్థ వాటా 26.2 శాతంగా ఉంది. ఈ ఏడాది షియోమీ రెడ్ మీ5, 5ఏ, నోట్ 5 తదితర మోడళ్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

వీటి ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండడంతో పాటు, ఎక్కువ ఫీచర్లని కలిగి ఉండటంతో ఎక్కువ అమ్మకాలు జరిగాయని సర్వేలు తెలిపాయి. అయితే శామ్ సంగ్ రెండో స్థానానికి పడిపోవడానికి అధిక ధరలు ఉండటమే అని పేర్కొన్నాయి. దీంతో ఎక్కువ వినియోగదారులు షియోమీ ఫోన్లు కొనుగోలు వైపు మొగ్గు చూపినట్లు తెలిపాయి.

ఇక చైనాకి చెందిన మరో సంస్థ వివో 5.8 శాతం వాటాతో మూడో స్థానంలో ఉండగా, వివో తర్వాతి స్థానంలో ఒప్పో ఉంది. కానీ  చైనాకు చెందిన లెనోవో, జియోనీ బ్రాండ్లు మాత్రం గణనీయ స్థాయిలో వాటాను కోల్పోయాయని సర్వే పేర్కొంది.

మామాట: మరి భారత్‌లో షియోమీ హవా ఎప్పటివరకు కొనసాగుతుందో..?

English summary:

According to Hong Kong-based Counterpoint Research, Xiaomi led the Indian smartphone market with 31.1 percent market share while Singapore-based Canalys said the company shipped over nine million units, giving it a market share of just over 31 percent.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *