భారీగా పతనమైన రూపాయి విలువ…

ముంబయి, 7 మే:

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా, ముడిచమురు బ్యారెల్ ధర 75 డాలర్లకు చేరింది.

ఈ నేపథ్యంలో రూపాయి మారకం విలువ ఇవాళ భారీగా పతనమైంది. డాలర్‌తో పోల్చితే రూపాయి 20 పైసలు (0.30 శాతం) పతనమై 67.13 వద్ద ట్రేడవుతోంది.

మరోవైపు డాలర్‌ విలువ డిసెంబర్‌ నాటి గరిష్ట స్థాయిలను బద్దలు కొడుతోంది. ఆరు మేజకర్‌ కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ విలువ, డాలర్‌ ఇండెక్స్‌లో 92.609కు పెరిగింది.

ఇక గతేడాది ఫిబ్రవరి తర్వాత భారత కరెన్సీ ఈ మేరకు పతనం కావడం ఇదే తొలిసారి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 66.86 వద్ద ఉన్న కరెన్సీ విలువ, ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభమైన గంటలోగానే 67.0850కి పడిపోవడం గమనార్హం.

అమెరికా డాలర్‌ విలువ బలపడుతుండటం, అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం రూపాయి విలువను దెబ్బతీస్తున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఇన్వెస్టర్స్ డాలర్‌‌ను ఉపసంహరించుకునేందుకు పోటీపడడం కూడా రూపాయి పతనానికి కారణంగా చెబుతున్నారు. అదే కాకుండా దేశీయంగా కర్ణాటక ఎన్నికల ప్రభావం కూడా రూపాయిపై పడుతోంది.

మామాట: పతనమవ్వడం తప్ప బలపడింది ఎప్పుడులే….

English summary:

The rupee (INR) fell sharply against the US dollar (USD) today to breach the 67 mark against the greenback. The rupee fell to as much as 67.13 per dollar, its lowest level since February 2017.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *