చిరిగిన, మాసిన నోట్లు చెల్లవ్… ఏం.. ఎందుకు?

న్యూఢిల్లీ, మే 14

మీ దగ్గర క్యాష్ ఉందా.. ? దానిని బంగారం కంటే భద్రంగా చూసుకోవాలి. ఆ క్యాష్‌లో నోట్లు చిరిగినా, మాసిన చెల్లవు. ఏ కోశానా వాటిని చిరగకుండా మాసిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం జనం మీదే వేసేశారు. ఇప్పటికి బ్రాంచీలను చేరిన ఆ నోట్లు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

2016 డిసెంబర్ 8న డీమానిటైజేషన్ వచ్చిన విషయం తెలిసింది. కొన్ని నోట్లు చరిత్రలో కలిసిపోయాయి. కొన్ని కొత్త నోట్లు పుట్టుకొచ్చాయి. అప్పటి నుంచి సామాన్యులకు ఎక్కడ లేని అగచాట్లు వచ్చిపడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ క్యాష్ అందుబాటులోకి రాలేదు. ఏటీఎంలు చాలా వాటిలో ‘నో క్యాష్’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.

అయితే తాజాగా వారిని ఇంకో అంశం వేధిస్తోంది. చిరిగిన, మాసిన రూ.200, రూ.2000 నోట్లు మార్చుకునే అవకాశం లేదు. వాటి స్థానంలో కొత్త నోట్లు ఇవ్వడానికి వీల్లేదు. దీంతో వినియోగదారుల నుంచి బ్యాంకులకు చేరిన ఆ నోట్లు అలాగే మూలుగుతున్నాయి. కొత్త సిరీస్ నోట్లను మార్చుకునేందుకు ప్రస్తుతానికైతే అవకాశం లేదని ఆర్‌బీఐ బ్యాంకులకు తేల్చి చెప్పింది కూడా.

ఆర్ బీఐ చట్టంలోని సెక్షన్ 28 అన్నది రూ.5, రూ.10, రూ.50, రూ.100, రూ.500, రూ.1,000, రూ.5000, రూ.10,000 డినామినేషన్ నోట్ల మార్పిడి గురించి మాత్రమే పేర్కొంది. ఇందులో రూ.200, రూ.2,000 నోట్లను చేర్చలేదు.

డీమానిటైజేషన్ చేయడానికి చూపిన తొందర, ఉత్సాహం, చట్టాన్ని సవరించే విషయంలో చూపలేదు. దీంతో ఒకటిన్న సంవత్సరంగా అది ఈ సమస్య అలాగే ఉంది. ఆర్ బీఐ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ కూడా రాసింది. కేంద్రం ఎప్పుడు స్పందిస్తే అప్పుడు ఇందుకు మోక్షం కలుగుతుంది.

మామాట: ఎన్నాళ్ళీ నగదు తిప్పలు… మోడీ మహాశయా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *