రోబో సేవలతో విస్తార ఎయిర్ లైన్స్

న్యూ ఢిల్లీ, మే 30:

విస్తార అనేది విమానయాన సంస్థ. సింగపూర్ ఎయిర్ లైన్స్ మరియు టాటా సన్స్ జాయింట్ వెంచరే “విస్తారా”. ఆటోమేషన్ లో భాగంగా ప్రయాణీకులకు మరింత ఎక్కువ సేవలు అందించడం కోసం రోబో ని వినియోగించనుంది.

ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలోని తన లాంజ్‌లో రోబో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది విస్తార విమానయాన సంస్థ.

ఈ రోబోకి వారు పెట్టుకున్న పేరు “రాడా”. ఈ రోబో నిర్దేశించిన దారిలో అటూ ఇటూ తిరుగుతూ ప్రయాణికులను పలకరిస్తుంది. వారి పాస్పోర్ట్ లను స్కాన్ చెయ్యగలదు అని విస్తార ప్రతినిధులు తెలిపారు.

అంతేకాకుండా ఈ రోబో ఫ్లైట్ స్టేటస్ తెలియజేస్తుందని , వెళ్లబోయే ప్రదేశంలో వాతావరణాన్ని కూడా తెలియజేస్తుందని సంస్థ తెలియజేసింది.

ఈ రోబో 4 చక్రాలతో 360 డిగ్రీలు తిరుగుతూ, మాట్లాడుతూ సేవలు అందించగలదు. ఈ రోబో లో అత్యంత నాణ్యమైన సౌండ్ & వాయిస్ సిస్టం అమర్చబడింది, 3 ఇన్ బిల్ట్ కెమెరాలు కూడ ఉన్నాయి అని పేర్కొంది.

ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడం కోసం రోబోను వినియోగిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ రోబో కేవలం సహాయం మాత్రమే కాదు, నచ్చిన పాటలు కూడా వినిపించగలదని తెలిపారు. ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ టర్మినల్‌–3లోని తమ లాంజ్‌లో జూలై 5 నుంచి రోబోను అందుబాటులో ఉంచుతామని పేర్కొంది విస్తార సంస్థ.

మామాట: ప్రయాణీకుల కోసం రోబో సేవలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *