ఫేస్‌బుక్ “డిజిటల్‌ లిటరసీ ప్రోగ్రామ్‌”

న్యూ ఢిల్లీ, మే 31:

సోషల్ మీడియా అంటే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది ఫేస్‌బుక్. ప్రపంచ సోషల్ మీడియాలో నెంబర్ వన్ గా ఉన్న ఫేస్‌బుక్ ఒక గొప్ప కార్యక్రమంతో ముందుకొచ్చింది.

భారతీయ మహిళల కోసం ఒక డిజిటల్ లిటరసీ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది, అదే “ఫేస్‌బుక్ డిజిటల్‌ లిటరసీ ప్రోగ్రామ్‌”.ఈ ప్రోగ్రాం కేవలం భారతీయులకు మాత్రమే.

ఈ డిజిటల్‌ లిటరసీ ప్రోగ్రామ్‌ కోసం దేశవ్యాప్తంగా 60 వేలమంది యూనివర్సిటీ మహిళా విద్యార్థులను ఎంపికచేసి, వారికి ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా, ఈమెయిల్‌ వాడకంపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ఫేస్‌బుక్ విడుదల చేసింది.

వారి వారి స్థానిక భాషల్లోనే వారికి శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలో మహిళలపై సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వారికి ఇంటర్నెట్ భద్రతపై అవగాహన కల్పించనున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌ కోసం’సైబర్ పీస్ ఫౌండేషన్’ సహకారం తీసుకుంటున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.

ఈ కార్యక్రమం హర్యానా, ఢిల్లీ, మణిపూర్, సిక్కిం, మేఘాలయ, మహారాష్ట్ర, తమిళనాడులోని ప్రధాన నగరాల్లోని యూనివర్సిటీ మహిళా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని ‘సైబర్‌పీస్‌ ఫౌండేషన్‌’ సంస్థ తెలిపింది.

గత మూడు సంవత్సరాల్లో సైబర్ నేరాలపై ఫిర్యాదులు పెరుగుతూ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళలు ఆన్‌లైన్‌లో, ఇంటర్నెట్‌లో ఉన్నపుడు అభద్రతా భావంతో ఉండకూడదన్నదే తమ ఆశయమని తెలిపారు.

మామాట: భారతీయ అభివృద్దికి ఫేస్ బుక్ కృషి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *