స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై, మే 31:

వరుసగా రెండు రోజులు నష్టాల్లో మునిగిన స్టాక్ మార్కెట్లు నేడు కొంచెం ఊరట కలిగిస్తున్నాయి. నిన్నటి వరకు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి.

ఈరోజు గణనీయంగా ఉదయం 35083.81 పాయింట్ల వద్ద ప్రారంభమయిన సెన్సెక్స్ 416.27 పాయింట్ల లాభంతో 35322.38 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

మరో సూచి నిఫ్టీ ఉదయం 10670.10 పాయింట్ల వద్ద ప్రారంభమయి 121.80 పాయింట్ల లాభంతో 10736.15 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. స్వల్ప లాభాలతో ఊరట.

ఈరోజు ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్లు కొంచెం తీపికబురునే అందించాయని చెప్పుకోవచ్చు. గత రెండు రోజులుగా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో నడుస్తున్నాయి.

ఈరోజు లాభాల్లో ఉన్న కంపెనీలు:

  • అదానీ పోర్ట్స్ సెజ్
  • హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్
  • ఇండస్ ఇండ్ బ్యాంక్
  • మహీంద్రా & మహీంద్రా
  • కోటక్ బ్యాంక్
  • హిందూ యూనీలీవర్
  • కోల్ ఇండియా లిమిటెడ్
  • టాటా మోటార్స్
  • ఇన్ఫో సిస్
  • ఏషియన్ పెయింట్స్
  • ఎస్ బ్యాంక్
  • ఎస్బీఐ
  • విప్రో
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
  • లార్సెన్ & టర్బో
  • ఐసీఐసీఐ బ్యాంక్
  • ఎన్ టీ పీసీ

మామాట: ఇకనుండైనా లాభాల బాటలో నడుస్తుందా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *