స్టాక్ మార్కెట్లు: నిన్న లాభం నేడు నష్టం

ముంబై, జూన్ 1:

దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న ఊరట నిచ్చి, ఈరోజు నష్టాల్లో నిలిచాయి. ఈరోజు ఉదయం 35373.98 పాయింట్ల వద్ద ప్రారంభమైనా సెన్సెక్స్ 95.12 పాయింట్ల నష్టానికి 35227.26 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

మరో సూచీ నిఫ్టీ ఉదయం 10738.45 పాయింట్ల వద్ద ప్రారంభమై 39.95 పాయింట్ల నష్టానికి 10696.20 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

నిన్న లాభాల్లో ముగిసిన లాభాలు నేడు నష్టాలతో ఉన్నాయి. బ్యాంకుల సమ్మె వలెనే ఈరోజు ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు తప్ప మిగిలిన బ్యాంకులన్నీ నష్టాలలో ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంకు కూడా స్వల్ప లాభాలతో ఉంది. రెండు రోజుల సమ్మె వలన అన్ని బ్యాంకులు నష్టాల్లోకి చేరుకున్నాయి అని విశ్లేషకులు చెప్తున్నారు. బ్యాంకులు నష్టాల్లో ఉంటే వాహన కంపెనీలు లాభాలను ఆర్జిస్తున్నాయి.

ఈరోజు లాభాల్లో ఉన్న కంపెనీలు:

  • బజాజ్ ఆటో
  • మారుతీ సుజుకి
  • భారతి ఎయిర్టెల్
  • టాటా మోటార్స్
  • ఐసీఐసీఐ బ్యాంకు
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
  • సన్ ఫార్మా
  • లార్సెన్ & టర్బో

మామాట: నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *