నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై, జూన్ 5:

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిసాయి. ఈరోజు ఉదయం గణనీయంగా 35029.45 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 108.68 పాయింట్ల నష్టానికి 34903.21 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక ఈరోజు ఉదయం 10630.70 పాయింట్ల వద్ద ప్రారంభమయిన నిఫ్టీ 35.35 పాయింట్ల నష్టానికి 10593.15 పాయింట్లకు క్షీణించి ముగించింది. ఈరోజు ఇన్వెస్టర్లకు స్వల్ప నష్టాలను మిగిల్చింది.

గత కొద్దీ కాలంగా లాభనష్టాల్లో మునిగితేలుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారమైన కుదుటపడతాయేమోనని కలలుకన్న ఇన్వెస్టర్లకు నిరాశే మిగిలింది.

నేడు లాభాల వేటలో విజయం సాధించిన కంపెనీలు:

  • రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
  • టాటా స్టీల్
  • హెచ్.డీ.ఎఫ్.సి
  • మారుతి సుజుకి
  • హెచ్.డీ.ఎఫ్.సి బ్యాంకు
  • ఇండస్ ఇండ్ బ్యాంకు
  • స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా
  • హిందూ యూనీలీవర్
  • కోటక్ బ్యాంక్

మామాట: నేడు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *