రెపోరేటును పెంచిన ఆర్బీఐ… దూసుకెళ్లిన మార్కెట్లు

ముంబై, 6 జూన్:

దాదాపు నాలుగేళ్ళ తర్వాత తొలిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం 6 శాతం ఉన్న దీనిని 6.25 శాతానికి పెంచింది. రూపాయి క్షీణత, ద్రవ్యోల్బణం పెంపు భయాలు, ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఆర్‌బీఐ రెపో రేటు(బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వడ్డీరేటే రెపో రేటు) పెంపుకే మొగ్గు చూపింది.

దీంతో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి.

సెన్సెక్స్ 276 పాయింట్లు పెరిగి 35,179కి వద్ద ముగియగా, నిఫ్టీ 92 పాయింట్లు లాభపడి 10,685కు చేరింది.

ఎయిర్‌టెల్‌, టైటాన్‌, టాటామోటార్స్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభపడగా.. హిందుస్థాన్‌ పెట్రోలియం, టెక్‌మహింద్రా, సిప్లా, గెయిల్‌, ఏషియన్ పెయింట్స్‌ షేర్లు నష్టపోయాయి.

మామాట: స్టాక్ మార్కెట్లకి ఊతమిచ్చిన రెపో రేటు పెరుగుదల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *