లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై, జూన్ 7:

దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం గణనీయంగా ప్రారంభం అయ్యాయి. ఈరోజు ఉదయం 35278.38 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 284.20 పాయింట్ల  లాభంతో 35463.08 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈరోజు ఉదయం 10722.60 పాయింట్ల వద్ద ప్రారంభమైన మరో సూచీ నిఫ్టీ 83.70 పాయింట్ల లాభానికి 10768.35 పాయింట్ల వద్ద ముగిసింది.

గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లను నిరాశపరుస్తూ వచ్చిన స్టాక్ మార్కెట్లు, నేడు స్వల్ప లాభాలబాట పట్టాయి. ఇన్వెస్టర్లకు ఈరోజు కాస్త ఊరట లభించిందనే చెప్పుకోవాలి.

స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు ఉన్నప్పటికీ నష్టం లేకపోవడంతో ఈరోజు కొద్దిగా పరిస్థితులు మెరుగుపడ్డాయనే చెప్పచ్చు. ఈరోజు చాలా కంపెనీలు లాభార్జన చేశాయి.

నేటి స్టాక్ మార్కెట్లో లాభాల్లో ఉన్న కంపెనీలు:

 • టాటా స్టీల్
 • టాటా మోటార్స్
 • టాటా మోటార్స్ (డీవీఆర్)
 • ఐసీఐసీఐ బ్యాంక్
 • యాక్సిస్ బ్యాంక్
 • విప్రో
 • ఏషియన్ పెయింట్స్
 • రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
 • హిందూ యూనీలీవర్
 • ఓఎన్ జీసీ
 • ఇన్ఫోసిస్
 • అదానీ పోర్ట్స్ సెజ్
 • హెచ్ డీ ఎఫ్ సి
 • హీరో మోటార్ కార్పొరేషన్
 • మహీంద్రా & మహీంద్రా
 • మారుతి సుజుకి
 • పవర్ గ్రిడ్
 • టీసీఎస్
 • లార్సెన్ & టర్బో
 • రెడ్డి లేబొరేటరీ
 • ఎస్ బ్యాంక్
 • బజాజ్ ఆటో

మామాట: ఊరటనిచ్చిన స్టాక్ మార్కెట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *