వాణిజ్య యుద్ధం దెబ్బకి నష్టాల్లో ముగిసిన మార్కెట్లు…

ముంబై, 18 జూన్:

అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం వలన అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది.  దీంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి.

అయితే ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలతో ఈ ఉదయం నుంచి సూచీలు ఒడిదొడుకుల మధ్య కొనసాగుతూ వచ్చాయి. ఆరంభంలో నష్టాలతో మొదలైన సూచీలు చివర్లో కాస్త కోలుకుని లాభాల్లోకి వచ్చినప్పటికీ ఇన్వెస్టర్స్ అమ్మకాల ముందు ఆ లాభాలు నిలవలేదు. దీంతో చివరికి మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి.

ఇక సోమవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 73.88 పాయింట్లు కోల్పోయి 35,548.26 వద్ద ముగియగా, నిఫ్టీ కూడా 17.85 పాయింట్ల నష్టంతో 10,799.85 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.04గా కొనసాగుతోంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:

ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ (13.10%), జై ప్రకాశ్ అసోసియేట్స్ (6.57%), జీహెచ్సీఎల్ (5.37%), హిందుస్థాన్ పెట్రోలియం (5.19%), వక్రాంగీ లిమిటెడ్ (4.98%).

టాప్ లూజర్స్:

బజాజ్ హిందుస్థాన్ షుగర్ లిమిటెడ్ (-5.00%), టొరెంట్ పవర్ (-4.88%), ఎన్సీసీ (-4.20%), ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (-4.05%), హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ (-3.84%).

మామాట: మరి ఈ వాణిజ్య యుద్ధం ఎప్పటికీ ముగుస్తుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *