డొల్ల కంపెనీల డీ లిస్ట్

ముంబయి,జూలై 3,  దేశవ్యాప్తంగా అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్న 222 డొల్ల‌ కంపెనీల షేర్లను బుధవారం ట్రేడింగ్‌ నుంచి పక్కన పెట్టాలని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిర్ణయించింది. దీనిలో భాగంగా వాటిని డీలిస్ట్‌ చేయనుంది. ఈ కంపెనీలు అక్రమ నిధుల ప్రవాహానికి సహకరిస్తున్నాయని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో లిస్టెడ్‌, లిస్ట్‌ కానీ సంస్థలు ఉన్నాయి.

‘‘ఆరునెలల నుంచి ససెన్షన్‌లో ఉన్న 210 కంపెనీల షేర్లు ఎక్స్ఛేంజీ నుంచి డీలిస్ట్‌ చేస్తున్నాం. ఈ మేరకు ఎక్స్ఛేంజీ డీలిస్టింగ్‌ కమిటీ జారీ చేసిన ఆదేశాలు జులై 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇవే కాకుండా ఏషియన్‌ ఎలక్ట్రానిక్స్‌, బిర్లా పవర్‌ సొల్యూషన్స్‌, క్లాసిక్‌ డైమండ్స్‌, ఇన్నోవెటీవ్‌ ఇండస్ట్రీస్‌, పారామౌంట్‌ ప్రింట్‌ ప్యాకింగ్‌, ఎస్‌వీవోజీఎల్‌ ఆయిల్‌ గ్యాస్‌ అండ్‌ ఎనర్జీలను ఎన్‌ఎస్‌ఈ డీలిస్ట్‌ చేసింది. వీటిని కూడా ఎక్స్ఛేంజీ నుంచి డీలిస్ట్‌ చేయనుంది’’ అని బీఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది.

గత ఏడాది ఆగస్టులో 331 అనుమానాస్పద కంపెనీలపై చర్యలు తీసుకోవాలని సెబీ సూచించింది. దీంతోపాటు ఇప్పటికే ప్రభుత్వం రెండు లక్షల కంటే ఎక్కువ కంపెనీలను డీరిజస్టర్‌ చేసింది.

మామాట : ఎంత కాలమైనా పాపం పండకుండా ఉంటుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *