ఇక ప్రతి ఇల్లు స్మార్ట్ హోమ్‌గా మారుతుంది…

ముంబై, 5 జూలై:

ఇక ప్రతి ఇల్లు స్మార్ట్‌హోమ్‌గా మారేలా రిలయన్స్ సంస్థ ఓ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఫైబర్ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ సొల్యూషన్స్‌ను ‘ది జియో గిగా ఫైబర్’ పేరిట దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు  సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు.

ఈరోజు ముంబైలో జరుగుతున్న ఆ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో ఈ విషయాన్ని షేర్ హోల్డర్ల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. ఇక ఈ జియో గిగా ఫైబర్ అందుబాటులోకి వస్తే, అల్ట్రా హై డెఫినిషన్, మల్టీ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలను ఇంటి వద్ద పొందవచ్చని తెలిపారు.

తన యజమాని ఇచ్చే ప్రతి కమాండ్‌ను అర్థం చేసుకునేలా వాయిస్ యాక్టివేటెడ్ వర్చ్యువల్ అసిస్టెన్స్  అందుబాటులోకి వస్తుందని, డిజిటల్ షాపింగ్ దగ్గరవుతుందని, సీసీ కెమెరాల నుంచి, గృహోపకరణాల వరకూ చూపుడు వేలు, నోటి మాట ద్వారా నియంత్రణలో ఉంటాయని అన్నారు. అలాగే మనం ఎక్కడ ఉన్నా స్మార్ట్ ఫోన్ నుంచి ఇంటిని నియంత్రణలో ఉంచుకోవచ్చని ముఖేష్ తెలిపారు.

అదేవిధంగా అతి తక్కువ ధరలో లభిస్తున్న 4జీ ఫీచర్ జియో ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ లు అందుబాటులోకి రానున్నాయని, అవి కూడా వాయిస్ కమాండ్ కంట్రోలింగ్ లో ఉంటాయని అంబానీ వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి ఈ సేవలను రిలయన్స్ జియో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుందని అన్నారు.

మామాట: పెను సంచలనానికి తెరలేపారుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *