అమ్మకాల్లో టాప్-10లో ఉన్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే…

ఢిల్లీ, 6 జూలై:

ప్రస్తుతం ప్రపంచ మొబైల్స్ మార్కెట్‌లో దిగ్గజ సంస్థలు యాపిల్‌, శామ్‌సంగ్‌, షియోమీల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. నెల నెలకి ఒకదాన్ని మించి ఒకటి అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. అలా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడైన ఫోన్లలో శామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

అయితే ఏప్రిల్‌లో నెంబర్1 గా ఉన్న శామ్‌సంగ్‌ని పక్కకి నెట్టేసి  మే నెలలో ఈ స్థానాన్ని యాపిల్‌ కైవసం చేసుకుంది. ఏప్రిల్‌లో ఐదో స్థానంలో ఉన్న ఐఫోన్‌ 8.. మే నెలలో తొలిస్థానంలో నిలవడం విశేషం.

ఈ మేరకు మే నెలలో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలపై ప్రముఖ అధ్యయన సంస్థ కౌంటర్‌పాయింట్ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. మే నెలలో ఐఫోన్ 8 ఫోన్లు ఎక్కువగా అమ్ముడవగా.. ఆ తర్వాత శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫోన్ రెండో స్థానంలో నిలిచింది.

iphone-x

ఇక యాపిల్‌ ఐఫోన్‌ X మూడో స్థానం దక్కించుకోగా, చైనా దిగ్గజ సంస్థ షియోమీ రెడ్‌మీ 5ఏ నాల్గవ స్థానంలో నిలిచింది. అలాగే  యాపిల్‌కే సంబంధించిన ఐఫోన్‌ 8 ప్లస్‌ ఐదవ స్థానంలో, ఏప్రిల్‌లో రెండో స్థానంలో నిలిచిన శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌9 మే నెలలో ఆరో స్థానానికి పడిపోయింది.

అదేవిధంగా హువాయి పీ20 లైట్‌ ఏడు, వివో ఎక్స్‌21 ఎనిమిది, షియోమీ రెడ్‌మీ 5 ప్లస్‌ తొమ్మిది, ఒప్పో ఏ83 పదో స్థానంలో ఉన్నాయి.

మామాట: మొత్తానికి యాపిల్ హవా కొనసాగుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *