సుజుకీ నుంచి జిమ్ని

టోకియో,జూలై, 7,   మారుతీ సుజుకీ జిప్సీ సరికొత్త వెర్షన్‌ (నాలుగో తరం) జిమ్ని వాహనాన్ని సుజుకీ నేడు జపాన్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని జిమ్ని, జిమ్ని సియోర్రా అనే రెండు వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. జిమ్ని సియెర్రాను ప్రపంచలోని ఇతర మార్కెట్లలో విడుదల చేయనున్నారు. జిమ్ని వేరియంట్‌ ధర భారత కరెన్సీ ప్రకారం రూ.9.06లక్షల నుంచి రూ.11.85లక్షలు, జిమ్ని సియెర్రా ధర రూ.10.94 లక్షల నుంచి రూ.12.82 లక్షలుగా నిర్ణయించారు.

జిమ్ని కంటే జిమ్ని సియెర్రా వాహనం కొంచెం విశాలంగా ఉంది. రెండు వేరియంట్లకు మూడు తలుపులు ఉన్నాయి. హెవీడ్యూటీ బంపర్లు, టెయిల్‌గేట్‌ మౌంటెడ్‌ స్పేర్‌లు ఉండగా, ఇది రెండు రంగుల కాంబినేషన్‌లో వస్తోంది. జంగిల్‌ గ్రీన్‌, మీడియం గ్రే, బ్లూ ఐష్‌ బ్లాక్‌ పెరల్‌, సిల్వర్‌ మెటాలిక్‌, స్పేర్‌వైట్‌, ప్యూర్‌ వైట్‌ పెరల్‌, కైనెటిక్‌ ఎల్లో, షిఫాన్‌ ఐవరీ, బ్లైసిక్‌ బ్లూ మెటాలిక్‌ రంగుల్లో లభిస్తోంది. ఇంటీరియర్‌ మొత్తం నలుపు రంగులో ఉంది. స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, ఆటోమెటిక్‌ క్లైమెంట్‌ కంట్రోల్‌, కీలెస్‌ ఎంట్రీ, ఇంజిన్‌ స్టార్ట్‌ స్టాప్‌ బటన్‌, హిల్‌ హోల్డ్‌, ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌, టైర్ ‌ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

జిమ్నిలో 685సీసీ 3సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 64బీహెచ్‌పీ శక్తిని, 96ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. జిమ్ని సియెర్రాలో 1.5లీటర్‌ కె15బీ 4సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 100 బీహెచ్‌పీ శక్తిని, 130 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. రెండిట్లోను 5స్పీడు మాన్యూవల్‌, 4స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను అమర్చారు. త్వరలో ఈ వాహనాన్ని భారత్‌లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

మామాట : జిమ్నీ అదిరింది సుజుకీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *