ట్రేడ్‌వార్: చైనా వర్సెస్ అమెరికా..

వాషింగ్టన్, 7 జూలై:

అగ్రరాజ్యలైన అమెరికా, చైనాల మధ్య మళ్ళీ వాణిజ్య యుద్ధం మొదలైంది. చైనా నుంచి అమెరికా దేశానికి దిగుమతి అవుతున్న మెషినరీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్స్, ఎల్‌ఈడీలుసహా హై-టెక్ ఎక్విప్‌మెంట్‌తో కూడిన దాదాపు 34 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 25 శాతం సుంకాలను ట్రంప్ సర్కారు వేసింది. ఈ సుంకాలు శుక్రవారం నుండి అమల్లోకి వచ్చాయి. మరోవైపు దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు వెళ్తామంటూనే.. డాలర్‌కు డాలర్ వసూలు చేస్తామని చైనా హెచ్చరించింది.

కానీ ఏం చర్యలు తీసుకోబోతోందనే విషయాన్ని వివరించలేదు. ఇక అమెరికా ఇది ప్రారంభం మాత్రమే అని.. దాదాపు 450 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తోంది. చైనా కారణంగా తమకు పెద్ద ఎత్తున వాణిజ్య లోటు ఏర్పడుతోందని, గత ఏడాది చైనా ఉత్పత్తుల కారణంగా అత్యధికంగా 375.2 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడిందని స్పష్టంచేసింది.

ఇక ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య పోరుపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

మామాట: ఎవరూ తగ్గేట్లులేరుగా…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *