సుజుకి నుంచి రెండు సూపర్ బైక్స్…

ఢిల్లీ, 9 జూలై:

యువతని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా రెండు సూపర్ బైక్స్‌ని మార్కెట్లోకి తాజాగా విడుదల చేసింది. జిక్సర్ ఎస్పీ మరియు జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్పీ పేరుతో నూతన మోడళ్లను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు కొత్త మోడల్స్ అధునాతన సదుపాయాలతో ఆకర్షణీయమైన గోల్డెన్, బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ మోడళ్లలో 155సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను వాడటం తో SEP( Suzuki’s Eco Performance)టెక్నాలజీ ఉపయోగించారు.

ఇక వీటిలో కొత్తగా ఆకట్టుకునేలా రూపొందించిన ఎస్పీ ఎంబ్లంను, అలాగే గ్రాఫికల్‌గా అత్యంత ఆకర్షణీయంగా రూపొందించిన ఫ్రంట్ కౌల్‌తో పాటు పెట్రోల్ ట్యాంకును అందించినట్లు సంస్థ తెలిపింది.

ఈ వాహనాలు అన్ని నగరాల్లోని సుజుకి డీలర్ షిప్ షోరూంలలో అందుబాటులో ఉండనున్నాయని సుజుకి సంస్థ ప్రకటించింది.

వీటి ధరలు వచ్చి జిక్సర్ ఎస్పీ ధర రూ.87,250(  ఎక్స్ షోరూం డిల్లీ) జిక్సర్ ఎస్ఎఫ్ ఎస్పీ ధర 1,00,630  ( ఎక్స్ షోరూం డిల్లీ)

మామాట: మరి అమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *