రివర్స్ నడిచే హోండా గోల్డ్ వింగ్ బైక్….

ఢిల్లీ, 10 జూలై:

సాధారణంగా కారులకి రివర్స్ గేరు ఉపయోగించి వెనక్కి నడపవచ్చు..కానీ బైకులలో ఇది అసాధ్యం..ఏదో మనం కాలుతో వెనక్కి నెట్టుకుంటే తప్ప అది వెళ్ళదు.

అయితే ఇలాంటి ఆప్షన్‌ను ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హోండా బైక్స్‌లో కూడా తీసుకొచ్చింది.

కొత్తగా లాంచ్ చేస్తున్న సూపర్ పవర్ బైక్‌లో రివర్స్ గేర్ ఆప్షన్ ఇచ్చింది. తాజాగా హోండా సంస్థ కొచ్చిలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో ఈ బైక్‌ను ప్రదర్శించింది.

రివర్స్ గేరు ద్వారా వెనక్కి వెళ్ళే దీనికి గోల్డ్ వింగ్‌గా నామకరణం చేసింది.

గోల్డ్ వింగ్ బైక్ ఫీచర్లు:

ఈ గోల్డ్ వింగ్ బైక్ ఇంజిన్ కెపాసిటీ 1833CC హార్స్ పవర్. ఆరు సిలిండర్ల ఇంజిన్ ఈ బైక్ ప్రత్యేకత. అల్యూమినియంతో తయారు చేశారు. మొత్తం 7 గేర్లు ఉంటాయి. ఇందులో ఆరు ముందుకు.. ఒకటి వెనక్కి ఉంటుంది. రెండు క్లచ్‌లు ఉంటాయి. ఆటోమేటిక్‌గా పని చేస్తాయి.

ఇక ఇందులో యాపిల్ ప్లే కార్ టెక్నాలజీ ఉంది. ఇది ఐఫోన్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలాగే మ్యాప్స్, మ్యూజిక్‌తో పాటు కాంటాక్ట్స్ లిస్ట్‌కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే ద్వారా ఎంత స్పీడ్‌లో ఉన్నా స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు వాయిస్ ఇంటరాక్ట్ ద్వారా సమాచారాన్ని చెబుతుంది.

అన్నిటికంటే ముఖ్యంగా యాక్సిడెంట్ అయినా లేక బైక్ కింద పడినా వెంటనే నాలుగు వైపుల నుంచి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. గాలి వేగం, దిశను ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ స్పీడ్ కంట్రోల్ చేస్తోంది.

అన్నీ సౌకర్యాలు గల ఈ బైక్ ధర ఇండియాలో ధర అక్షరాల రూ.32 లక్షలు.

మామాట: కోటీశ్వరులు మాత్రమే కొనుగోలు చేసుకోగలరు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *