ఐడియా-వోడాఫోన్ విలీనం..కేంద్రం సిగ్నల్…

ఢిల్లీ, 10 జూలై:

తీవ్ర అప్పులతో కొనసాగుతున్న టెలికాం సంస్థలు ఐడియా-వోడాఫోన్ విలీనానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ విలీనానికి టెలికం మంత్రిత్వ శాఖ నిన్న షరతులతో కూడిన అనుమతినిచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇక స్పెక్ట్రం కింద వొడాఫోన్‌కు రూ.3,926 కోట్లు, బ్యాంక్ గ్యారెంటీ కింద రూ.3,342 కోట్లు చెల్లించాలని ఐడియాను టెలికం మంత్రిత్వ శాఖ ఇదేవరకే ఆదేశించింది.

అయితే విలీనం తర్వాత ఏర్పడనున్న సంస్థ 23 బిలియన్ డాలర్ల(రూ.1.5 లక్షల కోట్లకు పైగా), 35 శాతం మార్కెట్ వాటా, 43 కోట్ల మంది వినియోగదారులతో దేశంలో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించనున్నది.

కానీ ప్రస్తుతానికి దేశంలో అతిపెద్ద నెట్‌వర్క్‌గా భారతీ ఎయిర్‌టెల్ ఉంది. ఇక ఐడియా-వోడాఫోన్ విలీనం అయితే ఆ ఎయిర్‌టెల్ స్థానంలో ఇవి ఉంటాయి. కాగా, ప్రస్తుతం ఇరు సంస్థలకు రూ.1.15 లక్షల కోట్ల మేర అప్పు ఉన్నది.

మామాట: మరి ఆ తర్వాతైనా లాభాల్లో నడుస్తాయో లేదో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *