మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ బైక్‌

హైదరాబాద్‌, జూలై 12,  హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్‌రాన్‌ సంస్థ తొలి సారిగా ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఎలక్ట్రిక్‌ బైక్‌ ‘ట్రానెక్స్‌ వన్‌’ను విడుదల చేసింది. ఇది తొలి క్రాసోవర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ అని కంపెనీ తెలిపింది. స్మార్ట్‌రాన్‌ కంపెనీకి చెందిన ట్రానెక్స్‌ మోటార్స్‌ (గతంలో వోల్టా మోటార్స్‌) ఈ బైక్‌ను విడుదల చేసింది. విడుదల ఆఫర్‌గా ఇ-బైక్‌ ధరను రూ.49,999 నిర్ణయించినట్టు యాజమాన్యం ప్రకటించింది. తొలి విడతలో  ముందుగా బుక్‌ చేసుకున్న వారికి జులై 16 నుంచి అందజేస్తామని కంపెనీ తెలిపింది. ఇంటెలిజెంట్‌, కనెక్టెడ్‌ ప్లాట్‌ఫారమ్‌ ట్రాన్‌ఎక్స్‌టీఎంను వాహన పరిశ్రమకు విస్తరించాలన్న స్మార్ట్‌రాన్‌ కల ట్రాన్‌ఎక్స్‌ మోటార్స్‌ ద్వారా సాకారమైందని స్మార్ట్‌రాన్‌ ఛైర్మన్‌, వ్యవస్థాపకుడు మహేశ్‌ లింగారెడ్డి తెలిపారు.

విశేషాలు…

గంటకు 25 కి.మీ.ల వేగం; మల్టిపుల్‌ రైడ్‌ మోడ్‌లు, వర్చ్యువల్‌ గేర్లు, 3 ఎలక్ట్రిక్‌ గేర్లు, 6 స్పీడ్‌ షిమనో షిప్టర్లు; విమానాలను తయారు చేసే ఏరోగ్రేడ్‌ అలాయ్‌తో బైక్‌ ఫ్రేమ్‌ తయారీ; ఒక సారి ఛార్జి చేస్తే 50 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది.

మామాట : ఇకనైనా పర్యావరణానికి మేలు జరుగుతుందా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *