అమరావతిలో ‘అమెజాన్’..

విజయవాడ, 13 జూలై:

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ తమ సంస్థ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరలోని విజయవాడ నగరంలో ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు హైదరాబాదు నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న అమెజాన్, నవ్యాంధ్రకు కూడా తన కార్యకలాపాలను విస్తరించింది.

అంటే ఇక నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే ఏపీ వినియోగదారులకు, విజయవాడ కేంద్రం నుంచే వస్తువులను సరఫరా చేయబోతోందనమాట.

అయితే ఇప్పటికే దేశం మొత్తం మీద 13 రాష్ట్రాల్లో అమెజాన్‌కు 50 కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది చివరిలోగా మరో ఐదు కేంద్రాలను ఈ సంస్థ ఏర్పాటు చేయబోతోంది.

కాగా, విజయవాడలో అమెజాన్ కేంద్రం ఏర్పాటు చేసిన సందర్భంగా అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు అఖిల్ సక్సేనా మాట్లాడుతూ…సులభతర వాణిజ్యానికి ఏపీ ప్రభుత్వం మంచి ప్రోత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. అందుకే తమ కేంద్రాన్ని విజయవాడలో కూడా ప్రారంభించినట్టు తెలిపారు.

దీని ద్వారా ఏపీ వినియోగదారులు వస్తువులను మరింత త్వరగా పొందవచ్చని, ఆర్డర్ చేసిన వస్తువులు ఒకటి, రెండు రోజుల్లోనే ఇంటికి వస్తాయని తెలిపారు.

మామాట: మంచి పరిణామమే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *